- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రూ. 500కే గ్యాస్ సిలిండర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ శుక్రవారం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లిన రేవంత్.. బహిరంగ సభకు ముందు స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల కష్టాలు దృష్టిలో పెట్టుకుని గతంలో రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇచ్చామని.. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1200కు పెరిగిందన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే త్వరలోనే మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఈ సందర్భంగా రేవంత్ ప్రకటించారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయని.. సామాన్యులపై భారం పడకుండా అతి త్వరలోనే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామని తెలిపారు. మహిళలు ఆత్మగౌరవంతో ఉండి పదిమందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.