- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘KCR కౌన్ కిస్కా గొట్టం.. కేటీఆర్ ఓ పిచ్చోడు’.. తండ్రికొడుకులపై CM రేవంత్ ఘాటు విమర్శలు
దిశ, తెలంగాణ బ్యూరో: “కేసీఆర్ కౌన్ కిస్కా గొట్టం. కేటీఆర్‌కు మైండ్ దొబ్బింది. పిచ్చోడు. కరెంట్ షాక్ ఇవ్వాలి. ఎప్పుడు ఏం మాట్లాడుతుండో అర్ధం కావట్లే. కరెంట్ షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది” అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. లోక్ సభ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే పార్టీ గేట్లు ఓపెన్ చేస్తున్నామని తెలిపారు. జాయినింగ్స్ పెరుగుతాయన్నారు. సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు. సీఎం, సీఎస్‌ల నుంచి బయోమెట్రిక్ అమలు చేస్తామన్నారు. క్యాబినేట్ విస్తరణ ఇప్పట్లో లేదన్నారు.
కేసీఆర్ కూడా గతంలో 80 రకాల బీర్ల బ్రాండ్‌లు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారన్నారు. నయీం కేసుపై సర్కార్‌లో చర్చ లేదన్నారు. రాష్ట్రంలో పవర్ పొందినట్లే, కేంద్రంలోనూ వస్తున్నామన్నారు. ఎగ్జిట్ పోల్స్‌కు విభిన్నంగా ఫలితాలు ఉంటాయన్నారు. ఇక రాష్ట్రంలో నిజమైన రైతులకే రైతు బంధు ఇస్తామని, మల్లారెడ్డి, కేసీఆర్ లాంటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను 17 గంటలు పనిచేస్తున్నానని, అవసరమైతే 20 గంటలు కూడా వర్క్ చేస్తానని సీఎం క్లారిటీ ఇచ్చారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యాపార వస్తువుగా మార్చి లాభం పొందాలని చూశాడన్నారు. ఆయన గడిచిన పదేళ్లుగా వ్యాపార వేత్తగానే వ్యవహరించారన్నారు. పీసీసీ అధ్యక్షుడిపై ఏఐసీసీదే ఫైనల్ నిర్ణయమన్నారు. సమ్మక్క, సారలమ్మ, జంపన్నలను చంపిన రాజులుగా కాకతీయ రాజులను చూస్తున్నానని తెలిపారు. జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో ఏదున్నా, అందెశ్రీనే చెప్పాలన్నారు. రాష్ట్రంలో పవర్ కట్స్ లేవన్నారు. కానీ లోకల్ లీడర్లు, కింది స్థాయి అధికారులను పట్టుకొని హరీష్ రావు చిల్లర డ్రామాలు చేస్తుండన్నారు. రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదన్నారు. రైతులు ఒకే బ్రాండ్‌ను కోరడం వలన ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు.
ఎరువులు, విత్తనాలు డిమాండ్‌పై ప్రస్తుతం 10 శాతం అధికంగా తీసుకొచ్చామన్నారు. స్టాక్ లేనప్పుడు క్యూ లైన్లలో చెప్పులు పెడితే..? విత్తనాలు వస్తాయా..? అంటూ సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో 9 నుండి 12 ఎంపీ స్థానాలు, రెండు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే గెలుస్తామన్నారు. బీజేపీకి 4 నుంచి 5 సీట్లు వస్తాయని నడ్డానే చెబుతున్నారని వెల్లడించారు. అమర వీరులను గుర్తించేందుకు కమిటీ వేసి వాళ్ల కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. ఇందుకోసం ఓ కమిటీ వేస్తామన్నారు. అమర వీరులందరికీ న్యాయం చేస్తామన్నారు. అందరికీ లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కాళేశ్వరం, మేడిగడ్డపై ఎన్డీఎస్ ఏ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పుడే జరిగిందని, కానీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చించి అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా, అవతరణ వేడుకలకు కేసీఆర్ రావాల్సి ఉన్నా, రావట్లేదన్నారు. ఆయనకు రాష్ట్ర దినోత్సవంపై గౌరవం లేదన్నారు.
భారత దేశ స్వాతంత్ర విషయంలో పాకిస్తాన్ ఒక రోజు ముందుగానే వేడుకలు జరుపుకుంటుందని, అదే తరహాలో కేసీఆర్ చేశాడన్నారు. ఒక రోజు ముందుగానే ఆవిర్భావ వేడుకలు జరిపారన్నారు. వేడుకలకి అందర్నీ పిలిచామని, బీజేపీని కూడా ఇగ్నోర్ చేయలేదన్నారు. అఖిల పక్షంలో పిలుద్దాం అంటే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. 2015 లోనే ట్యాంక్ బండపై వెయ్యి కోట్లతో అమర వీరుల స్థూపం కట్టాలని తానే డిమాండ్ చేశానని గుర్తు చేశారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతిదీ పర్మిషన్ తీసుకోవాలని, ఎక్కడా ముళ్ల కంచెలు వేయలేదన్నారు. రాష్ట్రంలో విద్యా, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలనుకుంటున్నానని చెప్పారు. బీసీ కుల గణన చేసేందుకు ఆర్డర్ చేశామని, త్వరలోనే కుల గణన ప్రారంభం అవుతుందన్నారు. ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ రావాలని ఆశిస్తున్నామని, డాక్టర్స్ సూచన మేరకు ఆమె నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదన్నారు.
పవర్ కట్‌లు ఎక్కడా లేవన్నారు. 298 మెగావాట్లు పీక్ డిమాండ్‌ను కూడా ఇచ్చామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఎంప్లాయిస్‌కు రూల్స్ ప్రకారమే ప్రమోషన్లు ఉంటాయని, ఎంక్వైరీలో తప్పిదాలు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అపాయింట్ మెంట్ అంశం తన దృష్టిలోకి రాలేదన్నారు. కోడ్ తర్వాత అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. సెంట్రల్ బడ్జెట్ తర్వాత స్టేట్‌కు పుల్ బడ్జెట్ పెడతామన్నారు.