- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy : శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామి(Sri Kurumurthy Swamy)ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కురుమూర్తి స్వామి జాతర సందర్భంగా కురుమూర్తి స్వామి దేవాలయానికి సమీపంలో రూ. 110కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కురుమూర్తి ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు, అధికారులు, జిల్లా యంత్రాంగం ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
సీఎం వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనరసింహ, జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోవర్దన్‌రెడ్డి, ఈవో మదనేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, నాయకులు వట్టెం శివకుమార్, గూడూరు శేఖర్, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.