మహాలక్ష్మీ స్కీమ్‌పై CM రేవంత్ రెడ్డి ట్వీట్.. హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్

by Rajesh |
మహాలక్ష్మీ స్కీమ్‌పై CM రేవంత్ రెడ్డి ట్వీట్.. హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌కు మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ పథకం ద్వారానే బాలికలు పాఠశాలలకు వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పడం హాస్యాస్పదం. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచే అమల్లో వున్నది. గత ప్రభుత్వ పథకాలను, పనులను కాంగ్రెస్ నేతలు తమ ఖాతాలో వేసుకోవడం శోచనీయం.’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed