CM Revanth Reddy: హైదరాబాద్ సిటీలో మూడు వైపులా ఇసుక స్టాక్‌ పాయింట్లు: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |
CM Revanth Reddy: హైదరాబాద్ సిటీలో మూడు వైపులా ఇసుక స్టాక్‌ పాయింట్లు: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు స‌మీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువ‌గా వినియోగం జ‌రుగుతున్నదని, అందువల్ల త‌క్కువ మొత్తంలో ఇసుక అవ‌స‌ర‌మైన వారు కొనుగోలు చేసేలా న‌గ‌రానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లను సాధ్యమైఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపండినంత త్వరగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నుంచే ఇసుక సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే వినియోగదారులు అక్రమ సరఫరాదారులపై ఆధారపడరన్నారు. ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై (sand smuggling) ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని చెప్పారు. గ‌నుల శాఖ‌పై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇవాళ సీఎం ఉన్నతస్థాయి స‌మీక్ష (review on mines department) నిర్వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, ఇతర ఉన్నతాధికారులు హాజరైన ఈ సమీక్షలో గ‌త నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైనా అధికారులను సీఎం ప్రశ్నించారు. క్వారీలకు జరిమానాలపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఖనిజాల మైనర్ బ్లాక్‌ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు.

గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా విడుదల చేయండి

113 గల్ఫ్‌ (Gulf) మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా ఎక్స్‌గ్రేషియా (exgratia) అంశాన్ని సీఎం దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అనిల్ ఈరవత్రి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ నిధుల విడుదలకు ఆదేశాలిచ్చారు.

Next Story

Most Viewed