- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌కు CM మాస్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రం వచ్చాక పాలమూరుకు కేసీఆర్ చేసింది ఏమిటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీ ఇస్తే కేసీఆర్ నిర్మించారా అని నిలదీశారు. ఏం చేశారని పాలమూరు ప్రజలు బీఆర్ఎస్‌కు ఓటేయాలన్నారు.
పార్లమెంట్‌లో నిద్రపోవడానికి బీఆర్ఎస్‌కు ఓటు వేయాలా అన్నారు. కారు రిపేర్‌కు వెళ్లిందని కేటీఆర్ అన్నారని.. 2009లో కేసీఆర్‌ను కరీంనగర్ ప్రజలు తరిమికొట్టారన్నారు. కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందన్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారని.. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చారు. తమ ఎమ్మెల్యేలను ముట్టుకో మాడి మసైపోతావని ఘాటుగా స్పందించారు.