- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Hyd: కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్(Hyderabad Gosha Mahal Police Grounds)లో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆస్పత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూమి పూజ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామెదర రాజనర్సింహాతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకుల పాల్గొన్నారు.
కాగా రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందించేందుకు కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ ఆస్పత్రిని రూపొందిస్తున్నారు. ఆస్పత్రిలో 2 వేల పడకలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 30 డిపార్టుమెంట్లు సేవలు అందించనున్నాయి. 26.30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించనున్నారు. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ మైదానంలో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రికి సీఎం శంకుస్థాపన చేశారు. దీంతో ఆస్పత్రి నిర్మాణం ఇక నుంచి ఊపందుకోనుంది.
అయితే ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని గోషామహల్ పరిరక్షణ సమితి వ్యతిరేకిస్తోంది. ఆస్పత్రి నిర్మాణం వల్ల స్థానికులకు ఇబ్బందులు కలుగుతాయని ఆరోపిస్తోంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతోంది. గోషామహల్‌లో కాకుండా ఇంకెక్కడైనా నిర్మించాలని డిమాండ్ చేస్తోంది. ఈ రోజు ఆస్పత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసిన నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.