- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వాళ్లు గండి కొట్టకుండా చూడాల్సిన బాధ్యత మీదే.. అధికారులకు CM రేవంత్ ఆదేశం

దిశ, వెబ్‌డెస్క్: ఇసుక అక్రమ రవాణా(Illegal Sand Transportation)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(Integrated Command Control Center)లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక రీచ్‌లను తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని ఆదేశించిన చెప్పారు. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదిలా ఉండగా.. ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Indlu) నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందిస్తుండగా.. ఖర్చును తగ్గించేందుకు గాను ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరాపై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ మేరకు నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇసుక సరఫరాకు ఎటువంటి కొరత రానివ్వకుండా ఏం చేస్తే బాగుంటుందో సూచించడానికి ఈ కమిటీ అడ్వైజ్ ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను స్థానిక వాగుల నుంచి అందిచాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఖర్చు తక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.