- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Maha Shivratri: వేములవాడ మహాశివరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

X
దిశ, డైనమిక్ బ్యూరో: వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న (Maha Shivratri) మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరుకావాలని (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డిని అర్చకులు ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం వేములవాడ దేవస్థానం అర్చకులు, అధికారులు సీఎం రేవంత్‌ను కలిశారు. ఈ నేపథ్యంలోనే సీఎంకు మహాశివరాత్రి జాతర ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా, తెలంగాణలో అతిపెద్ద ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహా శివరాత్రి జాతర వేడుకలు ఈ నెల 25 నుంచి 27 వరకు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Next Story