Telangana Thalli Statue : తెలంగాణ తల్లి విగ్రహ తయారీ పరిశీలించిన సీఎం.. తుది మెరుగులపై సూచనలు!

by Ramesh N |   ( Updated:2024-11-29 07:53:04.0  )
Telangana Thalli Statue : తెలంగాణ తల్లి విగ్రహ తయారీ పరిశీలించిన సీఎం.. తుది మెరుగులపై సూచనలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి (Telangana Thalli) విగ్రహం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. విగ్రహ తయారీ తుది మెరుగుల పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహం తయారీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా పరిశీలించారు. తాాజాగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి.. అవుటర్ రింగు రోడ్డు దగ్గర తయారు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ పనులను సీఎం పరిశీలించారు. శిల్పిని విగ్రహాన్ని తయారీ పనులపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. విగ్రహం తుది మెరుగులపై పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

కాగా, డిసెండర్ 9న (Telangana State Secretariat) సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. యూపీఏ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం ప్రకటన.. కాంగ్రెస్ అగ్రనేత, సోనియాగాంధీ బర్త్ డే.. కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చిన రోజైన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story