CM Revanth Reddy : ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. కారణం ఇదేనా?

by M.Rajitha |
CM Revanth Reddy : ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. కారణం ఇదేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొద్దిసేపటి క్రితం ఢిల్లీ(Delhi) చేరుకున్నారు. గురువారం ఉదయం విదేశాంగ మంత్రి(Minister of Foreign Affairs) జైశంకర్(Jai Shankar) తో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అయితే ప్రస్తుతం జైశంకర్ విదేశీ పర్యటనలో ఉండగా.. బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకుంటారని సమాచారం. కాగా వీరి ఇరువురి భేటీపై స్పష్టత రానుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆకస్మిక పర్యటన వెనుక గల కారణం ఏమిటంటే.. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) విషయం చర్చించేందుకు విదేశాంగశాఖ మంత్రితో సీఎం సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో పలువురు కీలక నిందితులు విదేశాల్లో తలదాచుకుంటుండగా.. వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించి, శిక్ష పడేట్లు చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఆయా దేశాల విదేశాంగశాఖలతో మాట్లాడి నిందితులను ఇక్కడికి రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి జైశంకర్ కు విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం.

Next Story

Most Viewed