- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రోడ్డుపై పరుగులు పెట్టిస్తా జాగ్రత్త’.. కేసీఆర్‌కు CM రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి శనివారం మెదక్‌లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అర్హులైన రైతులందరికి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే సీజన్‌లో వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ అంటున్నారు.. కానీ పదేళ్లు ఇక్కడే ఉంటాం.. ఎవరు వస్తారో రండి చూసుకుందామని సవాల్ విసిరారు. మాజీ సీఎం కేసీఆర్ పిట్టల దొరలా మారారని.. ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి జాగ్రత్త.. కాంగ్రెస్‌పై చెయ్యి వేస్తే మాడి మసైపోతారని వార్నింగ్ ఇచ్చారు. తాను జైపాల్ రెడ్డి.. జానారెడ్డిని కాదని తెలుసుకోవాలని.. కాంగ్రెస్‌ను టచ్ చేస్తే రోడ్డుపై పరుగులు పెట్టిస్తా జాగ్రత్త అని హెచ్చరించారు. కాంగ్రెస్ పథకాలు చూసి కేసీఆర్ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల కష్టాలు చూడలేక సిలిండర్లు, స్టవ్‌లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. మెదక్ జిల్లాలో ఎన్ని డబుబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే మెదక్ అభివృద్ధి సాధ్యమని.. వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Read More...
కాంగ్రెస్‌వి మాటలే! ఆ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు లేవు.. హారీష్ రావు