కేంద్రంలో అధికారం ఆ పార్టీదే.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్

by Disha Web Desk 19 |
కేంద్రంలో అధికారం ఆ పార్టీదే.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సారి సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. 2004, 2009లో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలిచిందని.. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ సారి మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని జోస్యం చెప్పారు.

సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ను గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించే బాధ్యత తనదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. కేంద్రమంత్రిగా ఉన్న ఎంపీ కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. జంట నగరాలు వరదలతో మునిగితే కిషన్ రెడ్డి ఏమైనా చేశారా అని నిలదీశారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ మంచోడే కానీ.. ఆయన పరువు తీయడానికి కేసీఆర్ ఆయన్ను పోటీలో నిలబెట్టారని అన్నారు. పద్మారావు గౌడ్ నామినేషన్ కార్యక్రమానికి కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పద్మారావును ఓడించి కిషన్ రెడ్డిని గెలిపించేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed