- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సివిల్స్ మెయిన్స్ లో సత్తా చాటిన రాజీవ్ సివిల్స్ స్టూడెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం
దిశ, వెబ్ డెస్క్ / తెలంగాణ బ్యూరో : యూనియన్పబ్లిక్ సర్వీసు మెయిన్స్(UPSC Mains) 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాజీవ్ సివిల్స్(Rajiv Civils) అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 20 మంది తాజాగా యూపీఎస్సీ మెయిన్స్ఫలితాల్లోనూ విజేతలుగా నిలిచారు. ఈ ఏడాది తొలి సారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసింది. సింగరేణి(Singareni) సంస్థ అధ్వర్యంలో 135 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది ఆగస్ట్ 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీరికి చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులను ప్రొత్సహించాలని, వారికి కొంత ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి కృషికి తొడ్పాటు అందించవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారికి సాయంగా ఉపయోగపడింది. ఇంటర్వ్యూకు ప్రిపేర్ కావడానికి లక్ష సాయం ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
మొయిన్స్‌లో క్వాలిఫై అయింది వీరే...
వరంగల్ – ఈ. సాయి శివాని, రాహుల్ శంకేషి, పోతరాజు హరి ప్రసాద్, విక్రమ్ బేతి
ఖమ్మం – నల్లమల సాయికుమార్, బానోతు నాగ రాజా నాయక్
మేడ్చల్ – కడారి శ్రీవాణి, గాదె శ్వేత, రాపర్తి ప్రీతి
మెదక్ – కుమ్మరి శ్రవణ్ కుమార్
రంగారెడ్డి – మొహమ్మద్ అశ్ఫాక్, తొగరు సూర్యతేజ
మహబూబాబాద్ – బెస్త ప్రియాంజలి
సిద్ధిపేట – నరిగె స్వామి
నాగర్‌కర్నూలు – గోకమల్ల అంజనేయులు
ఆదిలాబాద్ – ఆర్. ప్రమోద్ కుమార్
వికారాబాద్ – బి. ప్రహ్లాద్
జగిత్యాల – బురుగుపెల్లి నీరజ్ కుమార్
కొత్తగూడెం – జస్వంత్ కుమార్
అసిఫాబాద్ – రామ్టెంకి సుధాకర్