- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ గెలుపుపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించారు. శుక్రవారం మధ్యాహ్నం సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదంతోనే తాము అధికారంలోకి వచ్చామని అన్నారు. గతంలో ఏనాడూ కేసీఆర్ అమ్మవార్లను దర్శించుకోలేదని చెప్పారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకున్నారని గుర్తుచేశారు. అమ్మవార్ల ఆశీర్వాదంతోనే తాము అధికారంలోకి వచ్చామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భక్తులు మేడారం జాతరకు ఆనందంగా వస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర ఏర్పాట్ల నిమిత్తం రూ.100 కోట్లు కేటాయించామని అన్నారు.
అమ్మవార్లను దర్శించుకోవాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు కూడా ఆహ్వానం పలుకుతున్నామని వెల్లడించారు. సమ్మక్క, సారలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తి అని కొనియాడారు. ధీరవనితలుగా పోరాడి అమరులై దేవతలుగా వెలిశారని చెప్పారు. నాలుగు కోట్ల ప్రజలు ప్రజలు తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవతలను కోరుకున్నట్లు తెలిపారు. ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడినుంచే మొదలు పెట్టామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో తమతో పాటు ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. అందుకే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందని అన్నారు.