- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM రేవంత్ బీజేపీలోకి పోవడం ఖాయం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ టీవీ చానెల్ డిబేట్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుల వ్యవహారం కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీలోకి వెళ్తారన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని ప్రచారం జరుగుతుంటే.. కాదు, బీజేపీలోకి వెళ్లనని ఆయన ఆ వార్తలను ఎందుకు ఖండిచట్లే అని ప్రశ్నించారు. కాంగ్రెస్ జెండాతోనే చనిపోతానని ఎందుకు చెప్పరని నిలదీశారు. చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా అని సవాల్ విసిరారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని.. అందుకే బీజేపీ అభ్యర్థులపై డమ్మీ కాంగ్రెస్ క్యాండిడేట్లను నిలబెడుతున్నారని ఆరోపించారు. మల్కాజిగిరిలో తేల్చుకుందామని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశానని.. ఇప్పటి వరకు దానిపై ఆయన సమాధానం చెప్పలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు కాంగ్రెస్‌ను వెంటాడుతామని తేల్చి చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 నుండి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈ సంరదర్భంగా కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.