టీఎస్‌పీఎస్సీ రద్దుకు సీఎం కేసీఆర్ నిర్ణయం?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-18 08:02:01.0  )
టీఎస్‌పీఎస్సీ రద్దుకు సీఎం కేసీఆర్ నిర్ణయం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. శనివారం ఉదయం టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సీఎస్ శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం సమావేశం అయ్యారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాలు సర్కార్‌ను కార్నర్ చేస్తున్న తరుణంలో పేపర్లు లీక్ కావడాన్ని సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పేపర్ల లీకేజీ అంశంతో పాటు పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

అయితే ఈ భేటీకి కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి కూడా సీఎం వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పేపర్ల లీకేజీతో ప్రభుత్వ ప్రతిష్ట అబాసు పాలవుతుండటంతో ప్రస్తుతం ఉన్న టీఎస్ పీఎస్సీ బోర్టును రద్దు చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఘంటా చక్రపాణికి ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత చైర్మన్ జనార్ధన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో గతంలో చైర్మన్‌గా పని చేసిన గంటా చక్రపాణి నుంచి ప్రభుత్వం ఏవైనా సలహాలు తీసుకుంటుందా? లేక నియామకాల విషయంలో ఆయన్ను ప్రభుత్వం సలహాదారుగా నియమించే అవకాశం ఉందా అనేది ఆసక్తిగా మారింది.

Also Read..

బీఆర్ఎస్‌కు భారీ షాక్... సిరిసిల్లలో..

Advertisement

Next Story