- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం కేసీఆర్ కు బంగారు తెలంగాణ సాధనే ఎజెండా : హోం మంత్రి మహమూద్ అలీ
దిశ, వనపర్తి : రాష్ట్ర సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనే ఎజెండాగా పనిచేస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పునరుద్ఘాటించారు. వనపర్తి జిల్లా కేంద్రం, నాగవరం శివారులో 29 ఎకరాలలో, సుమారు 29.90 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, డీజీపీ అంజని కుమార్ తో కలిసి ప్రారంభించారు. మొదట జిల్లా పోలీస్ శాఖ ద్వారా హోంమంత్రి మహమూద్ అలీ గౌరవ వందనం స్వీకరించి, పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ విద్యుత్ లేని పది జిల్లాలతో సాధించిన రాష్ట్రంను ఎలా అభివృద్ధి చేస్తారని తెలంగాణ రాష్ట్ర సాధన తొలినాళ్లలో అన్నా ఢిల్లీ నాయకులు సీఎం కేసీఆర్ దార్శినిక పరిపాలనతో ప్రస్తుత తెలంగాణ అభివృద్ధి భారత దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పడానికి గర్విస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ పది జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసి జిల్లాకు ఒక కలెక్టరేట్ జిల్లా పోలీస్ కార్యాలయాలను నిర్మించి ప్రజలకు పరిపాలనను చేరువచేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ భరోసా పెరిగిందన్నారు. నిఘానేత్రం నీడలో ఉందన్నారు.
మహిళల సంరక్షణ కోసం షీ టీంలను ఏర్పాటు చేశారని తెలిపారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషి రాష్ట్రంలో 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధిని సాధించగలిగామన్నారు. విద్య, వైద్యం, శాంతి భద్రతలు, పరిపాలన, వ్యవసాయం ఏ రంగంలోనైనా భావితరాల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ రక్షిత కే మూర్తి , మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read..
కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం: మాజీ మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు