- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ పేరు మీద రూ.51 కోట్లతో శాశ్వత నిధి ఏర్పాటు.. సీఎం కేసీఆర్
దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు మీద రూ.51 కోట్లతో శాశ్వత నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విశ్వమానవుడని, ఆయన ప్రతిపాదించినం సిద్ధాంతం విశ్వజనీనమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణగారిన వర్గాలకు ఆయన ఆశాజ్యోతి అన్నారు.
ఎవరో చెబితే అంబేద్కర్ విగ్రహం పెట్టలేదని, విగ్రహం ఏర్పాటు వెనుక ఓ బలమైన మెసేజ్ ఉందని సీఎం అన్నారు. అంబేద్కర్ సందేశం భావితరాలకు అందాలని చెప్పారు. దళితుల అభ్యున్నతికి పాటుపడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడే వారికోసం అంబేద్కర్ అవార్డులు ఇస్తామని, ఈ క్రమంలోనే అంబేద్కర్ పేరుతో శాశ్వత నిధిని ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ అవార్డులను ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.
Read more: