- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో నేతల చేరికల అంశం కీలకంగా మారింది. అన్ని పార్టీలో చేరకపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా ఈ అంశంలో కాంగ్రెస్, బీజేపీ నేతల వరుస ప్రకటనలు సంచలనంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేరికలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అనేక మంది నేతలు ఉత్సాహాన్ని చూపిస్తున్నారని కాంగ్రెస్ లో చేరే వారి జాబితా బయటపెట్టేందుకు సిద్ధంగా లేమన్నారు. చేరికలకు సంబంధించి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ సిద్ధాంతం నమ్మిన వారంతా పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. 2023లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని విమర్శించారు. డిమానిటైజేషన్ సమయంలో ఏ కారణంతో పెద్ద నోట్లను రద్దు చేశారో ఆ ప్రయోజనం రాలేదని తీరా ఇప్పుడు రూ.2 వేల నోట్లను రద్దు చేశారని మండిపడ్డారు. ఇందంతా నరేంద్ర మోడీ ఆడుతున్న వికృత క్రీడ అని దుయ్యబట్టారు.
Also Read...