హమ్మయ్యా.. ఎట్టకేలకు ఉప్పల్ స్టేడియం కరెంట్ బిల్లు క్లియర్

by Satheesh |
హమ్మయ్యా.. ఎట్టకేలకు ఉప్పల్ స్టేడియం కరెంట్ బిల్లు క్లియర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం కరెంట్ బిల్లు ఎట్టకేలకు క్లియర్ అయ్యింది. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కోటి 64 లక్షల కరెంట్ బిల్లును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మంగళవారం చెల్లించింది. టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఇవాళ కోటి 64 లక్షల చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు సీఎండీ ముషారఫ్‌కు కీలక విజ్ఞప్తి చేశారు. ఐపీఎల్ సమయంలో స్టేడియానికి కరెంట్ తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, విద్యుత్ బకాయిల నేపథ్యంలో ఐపీఎల్ సమయంలో అధికారులు ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story