- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్‌కౌంటర్‌పై స్పందించిన పౌరహక్కుల సంఘం.. స్పెషల్ డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అధికారిక సమాచారం మేరకు ఇప్పటికే ఈ ఆపరేషన్‌లో దాదాపు 37 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కాగా.. ఈ ఎన్‌కౌంటర్‌పై తాజాగా పౌరహక్కుల సంఘం స్పందించింది. అధికారులు వెంటనే మృతుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేసింది. మృతుల్లో ముఖ్యనేతలు నంబాల కేశవరావు, తక్కెళ్లపాడు వాసుదేవరావు ఉన్నట్లు సమాచారం ఉందని, అందువల్ల వెంటనే మృతుల పేర్లు, ఫోటోలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది.
కాగా.. చత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో గత కొద్ది రోజులుగా మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. 40 నుంచి 50 మంది వరకు మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కూంబింగ్‌కి సంబంధించిన వివరాలు వెల్లడించిన నారాయణపూర్ ఎస్పీ.. 2 రోజుల నుంచి నిర్విరామంగా ఆపరేషన్ కొనసాగిస్తున్నామని, ఈ ఆపరేషన్‌లో 37 మంది వరకు మావోయిస్టులను హతమార్చగా.. ఒకే ఒక్క జవాన్ గాయపడ్డాడని తెలిపారు. భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా తాము మావోయిస్టులపై వరుస విజయాలు సాధిస్తున్నామని తెలిపారు.