- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకలితో అలమటిస్తున్నారు.. దయచేసి సమస్యలు పరిష్కరించండి
దిశ, వెబ్‌డెస్క్: గాంధీ జయంతి రోజున ఆ మహాత్ముడికి ఆశా కార్యకర్తలు నివాళ్లు అర్పించారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు కీసరి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే నేతలంతా ముందు వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వేతనాలు రాక ఆశా వర్కర్లు ఆకలితో అలమటిస్తున్నారని, గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
వారికి వెంటనే రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, పెండింగ్ కంటి వెలుగు బకాయిలు వెంటనే ఇవ్వాలని, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆలేటి ఎల్లయ్య, ఎం.వీరయ్య, సీహెచ్ వెంకన్న, గంధం మనోహర్, ఆశా వర్కర్లు అన్నపూర్ణ, కవిత, శిల్ప, శోభ, మహేశ్వరి, విజయ, రమణ తదితరులు పాల్గొన్నారు.