CM Revanth: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ స్పందన

by Gantepaka Srikanth |
CM Revanth: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌(Allu Arjun)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు. ఇందులో తమ జోక్యం ఏమీ ఉండబోదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మరోవైపు.. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని అన్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న కారణంగా ఆయన్ను అరెస్టు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్‌(CP CV Anand) తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed