కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

by GSrikanth |   ( Updated:2023-12-13 11:06:15.0  )
కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం మంత్రులతో కలిసి స్వయంగా యశోద ఆసుపత్రికి వెళ్లి మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉన్నారు. పరామర్శ తర్వాత మంత్రి కేటీఆర్‌తో సీఎం చర్చించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిన బాధపడ్డానని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యలను ఆదేశించినట్లు తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన సలహాలు, సూచనలు చాలా కీలకమని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో కేసీఆర్ కాలుజారి కిందపడిపోయిన విషయం తెలిసిందే. దీంతో తుంటి ఎముక విరిగిపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స నుంచి కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

Advertisement

Next Story