సోనియా మాటిస్తే అది శిలాశాసనమే.. మీ తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మరు: సీఎం రేవంత్ రెడ్డి

by Ramesh N |
సోనియా మాటిస్తే అది శిలాశాసనమే.. మీ తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మరు: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకలైనా మహాలక్ష్మి, గృహలక్ష్మి పథాకాలను సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంర్భంగ పలువురు లబ్ధిదారులకు వేదిక మీద లాంచనంగా పథకాలు అందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన అందరికీ గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత కరెంటు ఇస్తామన్నారు. 200 లోపు యూనిట్లు వాడే అందరికీ మార్చి నెలలో జీరో బిల్లు వస్తుందన్నారు. అర్హత ఉండి ఎవరైనా దరఖాస్తు చేయకపోయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంచేశారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్ అని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అభయహస్తం ద్వారా 6 గ్యారంటీలు హామీ ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తున్నామన్నారు. ఇవాళ మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. చెవేళ్లలో లక్షమంది మహిళల సమక్షంలో ఈ పథకాలు ప్రారంభించాలని భావించామని, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల సచివాలయంలో పథకాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు.

కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం దీపం పథకం ద్వారా రూ.1,500కే దేశంలోని పేదలందరికీ గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్రంలోని భాజపా రూ.1,200కి పెంచిందన్నారు. పేదలకు గ్యాస్‌ సిలిండర్‌ భారం తగ్గించాలని రూ.500కే సిలిండర్‌ ఇస్తున్నామన్నారు.

ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా.. ఆర్థిక సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న శక్తి కూడా కట్టుకోని గత ప్రభుత్వం పెట్టిన ఖర్చులన్నీ తగ్గించుకుంటూ ఆర్థిక నియంత్రణ పాటిస్తూ.. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతుందని సీఎం స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన తండ్రి, కొడుకులు కానీ మామా, అల్లుళ్లు కానీ ఎలాంటి మాటలు మాట్లాడిన ప్రజలు వారిని నమ్మడం లేదన్నారు. సోనియా మాటిస్తే అది శిలాశాసనం అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed