- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో రియలైజ్ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నదని తెలిపారు. దేశభక్తి పెంచేలా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 75 ఏళ్ల ప్రగతి ఘనమే అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. పాలకుల అసమర్థత, భావదారిద్ర్యం వల్ల సమస్యలు ఇంకా ఉన్నాయని చెప్పారు.
దేశంలో పేదరికం, అసమానతలు ఇంకా తొలగిపోలేదని తెలిపారు. పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దు:ఖం తన్నుకొస్తది అని కేసీఆర్ అన్నారు. ఎటుచూసినా పడావుపడ్డ పొలాలు, ఎండిపోయిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు బలైపోయిన రైతన్నల జీవితాలే ఉండే అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇటువంటి అగమ్య గోచర పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణను పునర్నిర్మించిందని తెలిపారు. నిబద్ధతతో అవిశ్రాంతంగా శ్రమించి తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నామని అన్నారు. నేడు దేశంలో అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని అన్నారు.
Read More : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వారికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్