Online Fraud : ఆ చట్టాలతో ఆన్ లైన్ మోసాగాళ్లకు చెక్ !

by Y. Venkata Narasimha Reddy |
Online Fraud : ఆ చట్టాలతో ఆన్ లైన్ మోసాగాళ్లకు చెక్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆన్ లైన్ బెట్టింగ్..గేమింగ్ యాప్(Online Betting.. Gaming Apps)లతో మోసాల(Frauds)కు పాల్పడే వారిపై చర్యలకు కఠిన చట్టాలున్నాయని సీనియర్ ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్(V.C. Sajjanar )గుర్తు చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల‌ను ప్రమోట్ చేసే సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ల(Social Bedia Influencersపై కేంద్ర ప్రభుత్వం గ‌తంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. యువతను ఆన్‌లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం నేర‌మ‌ని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందని సంగతి అంతా గుర్తుంచుకోవాలని సూచించారు.

అయినా కొంత మంది ఇన్‌ప్లూయెన్సర్లు త‌మ స్వలాభం కోసం ఇష్టారీతిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల‌ను ప్రమోట్ చేస్తున్నారని సజ్జనార్ మండిపడ్డారు. అటువంటి వారంతా శిక్షార్హులు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. మాకు ల‌క్షల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.. మేం ఏం చేసిన న‌డుస్తుంద‌ని అనుకుంటే పొర‌పాటేనని స్పష్టం చేశారు. స‌మాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల‌ను ప్రమోట్ చేయ‌డం ఆపండని..స్వార్థానికి పోయి అమాయ‌కుల‌ ప్రాణాల‌కు బాధ్యులు కాకండని సజ్జనార్ హితవు పలికారు.

సాంకేతికత..ఇంటర్నేట్ విస్తరిస్తున్న కొద్ధి సమాజంలో ఆన్ లైన్..సైబర్ క్రైమ్ మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కృత్రిమ మేధ(AI) స‌హ‌కారంతో ఇంట‌ర్నెట్ ద్వారా ప్రజ‌ల్ని మోసం చేస్తున్నారు. జార్ఖండ్ జామ్‌తారా జిల్లాలో అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఇంటర్నేట్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న ఆరుగురు సైబ‌ర్ నేర‌గాళ్లను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ రకమైన మోసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్మెంట్‌లో ఆ సైబ‌ర్ నేర‌గాళ్లు నిపుణులు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్లు మాల్వేర్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. డీకే బాస్ పేరుతో వాళ్లు సైబ‌ర్ ఆప‌రేష‌న్ కొన‌సాగించారు. ఆ నేర‌గాళ్ల వ‌ద్ద నుంచి అనేక మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఏటీఎం కార్డులు, డ్రోన్‌, హై రెజ‌ల్యూష‌న్ కెమెరాల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సృష్టించిన వెబ్‌సైట్ నుంచి సుమారు 2700 మంది డేటాను సేక‌రించారు. నిందితులు 10 కోట్ల మేర మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పోలీసులు కేసు విచారణ కొనసాగిస్తున్నారు.


Next Story

Most Viewed