జనసేన నేతల అరెస్ట్‌పై చంద్రబాబు సీరియస్

by GSrikanth |
జనసేన నేతల అరెస్ట్‌పై చంద్రబాబు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో పోలీసుల ప్రవర్తించిన తీరుపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల ప్రవర్తనను తప్పు పట్టారు. జనసేన నేతల అరెస్ట్‌లను చంద్రబాబు ఖండించారు. విశాఖలో వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలు దారుణమని అన్నారు. పవన్ కళ్యాణ్ బస చేస్తున్న హోటల్‌లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమని సీరియస్ అయ్యారు. విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ అధినేతను పోలీసులు కారులో కూర్చోవాలని సూచించడంపై చంద్రబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాన్ అభివాదం చేయాలో వద్దో కూడా పోలీసులే నిర్ణయిస్తారా? ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story