- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MP Chamala : హరీశ్‌రావు దుబాయ్ వెళ్లిన రోజే కేదార్ మరణం! చామల సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలుగు సినీ నిర్మాత కేదార్ శెలగంశెట్టి (Kedar Selagamsetty) దుబాయ్‌లోని తన ప్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై (MP Chamala Kiran Kumar Reddy) ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిదాన్నీ సోషల్ మీడియాలో పెట్టే హరీశ్‌రావు దుబాయ్ పర్యటన వివరాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నీ దోస్తు బిడ్డ పెళ్లి 6 వ తేదీన ఉంది.. మరి ఆరో తారీఖు పెళ్ళి ఉంటే నువ్వు 22వ తేదీన ఎందుకు పోయినట్టు అని ప్రశ్నించారు. ఎవని బ్యాండ్ కొట్టనీకి పోయినవ్.. రీల్స్ కూడా చూపియ్యలే.. అని తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్‌రావు (Harish Rao) దుబాయ్ వెళ్లిన రోజే దుబాయ్‌లో కేదార్ చనిపోయారని సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్‌రావుకు శవరాజకీయాలు కొత్త కాదని మండిపడ్డారు. కేదార్ మరణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిమాండ్ చేశారు.
నల్లధనాన్ని తెల్లదనంగా మార్చుకోవడానికి రాజకీయ నాయకులు (Dubai) దుబాయ్ వెళ్తారని అన్నారు. లూటీ చేసిన పైసలు దుబాయ్‌లో దాచుకోవడానికి హరీశ్‌రావు దుబాయ్ వెళ్ళారని ఆరోపించారు. ఎలక్షన్లు, కలక్షన్లు ఆయన నినాదమన్నారు. హరీశ్‌రావు డిక్షనరీలో అగ్గిపెట్టె, రాజీనామాలు మొదటి పదాలని సెటైర్లు వేశారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నెంబర్ వన్ అని అన్నారు. కేసీఆర్ కోట్లు ఖర్చు పెట్టాడు కానీ పనిపై చిత్తశుద్ధి లేదని విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే ఎస్ఎల్‌బీసీ పూర్తి చేసేవారని, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి నాయకులే లేరని అన్నారు. గతంలో ప్రమాదాలు జరిగితే కేసీఆర్ ఎప్పుడైనా వెళ్లారా? అని ప్రశ్నించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం తొడలు కొట్టడానికి బీఆర్ఎస్ నేతలు బయటకు వస్తారని చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు. ఢిల్లీకి సీఎం వెళ్తే ప్రధాని సానుకూలంగా ఉంటున్నారని, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాత్రం తెలంగాణకి ఏమీ రానివ్వడం లేదన్నారు. తెలంగాణ బడ్జెట్‌లో తెలంగాణ ఊసు లేకుండా చేశారని విమర్శలు చేశారు.