- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్ 30లోగా ఆ పని చేయండి.. తెలంగాణకు కేంద్రం డెడ్ లైన్
దిశ, డైనమిక్ బ్యూరో: గనుల వేలంపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం కీలక సూచన చేసింది. జూన్ 30 వ తేదీ లోపు కనీసం ఆరు బ్లాకులకు వేలం నిర్వహించాలని స్పష్టం చేసింది. ఒక వేళ ఆ పనిని రాష్ట్రం చేపట్టకపోతే ఆ ప్రక్రియను తామే పూర్తి చేస్తామని కేంద్ర గనుల శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖను రాసింది. తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క మినరల్ బ్లాక్ ను కూడా వేలం వేయలేదని కేంద్ర గనుల శాఖ పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 11 బ్లాకుల జియాలాజికల్ నివేదికలను పంపించిటన్లు అధికార వర్గాలు తెలిపారు. వీటిలో ఐదు సున్నపురాయి, ఐదు ఇనుప ఖనిజం, ఒకటి మాంగనీస్ బ్లాకు ఉన్నాయని, గనుల వేలం విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ పలుమార్లు గుర్తు చేసినప్పటికీ ఆ ప్రక్రియ నిర్వహించలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో జూన్ 30 నాటికి కచ్చితంగా కనీసం ఆరింటికి వేలం పూర్తి చేయాలని లేఖలో స్పష్టం చేసింది. దేశంలో గనుల వేలం ప్రక్రియ 2015లో ప్రారంభం కాగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట గడువులోగా వేలం ప్రక్రియను పూర్తి చేయకుంటే వాటిని వేలం వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కేలా 2021లో నిబంధనలను సవరించారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 354 ప్రధాన మినరల్ బ్లాక్ లను వేలం వేయగా 48 చోట్ల ఉత్పత్తి ప్రారంభమైంది. కానీ తెలంగాణలో మాత్రం ఈ ప్రక్రియ జరగలేదని కేంద్రం ఆక్షేపించింది.
సీఎం అనుమతి రాగానే వేలం:
తెలంగాణలో మేజర్, మైనర్ మినరల్ బ్లాకులను వేలం పద్ధతిలో కేటాయించేందుకు గనుల శాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఖనిజాల వారీగా ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించారు. ఇందులో మూడు సున్నపురాయి బ్లాకులు, 12 చిన్నతరహా ఖనిజాల బ్లాకులు ఉన్నట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఆమోదం రాగానే వేలం ప్రక్రియ ను ప్రారంభించేందుకు గనుల మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ అనంతరం కీలక ప్రకటన:
కాగా, ఇటీవలే బొగ్గు, గనుల శాఖ మంత్రిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గనుల వేలం విషయంలో బొగ్గు గనుల శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. వాణిజ్యపర అవసరాల కోసం ఉద్దేశించిన బొగ్గు గనుల వేలం వచ్చే వారం జరుగుతుందని బొగ్గు గనుల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పదో రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తారని పేర్కొంది. ఇందులో 62 బ్లాకులను అమ్మకానికి పెడుతారని తెలిపింది.