కేసీఆర్‌కు కేంద్రం బిగ్ షాక్.. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక ప్రకటన

by GSrikanth |   ( Updated:2023-04-14 13:14:36.0  )
కేసీఆర్‌కు కేంద్రం బిగ్ షాక్.. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోలేదని శుక్రవారం స్పష్టం చేసింది. ఆర్ఐఎన్ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలుపుదల చేసినట్లు మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు ప్రవేటీకరణ చేయబోమని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ గురువారం ఏపీ పర్యటనలో ప్రకటించగా దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో సింగరేణి సంస్థ పాల్గొనబోతోందని కేసీఆర్ నిర్ణయంతోనే కేంద్రం వెనక్కి తగ్గిందని తెలంగాణకు చెందిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. ఇంతలో కేంద్ర మంత్రి ఫగ్గన్ తన వ్యాఖ్యలపై మెలిక పెట్టగా తాజాగా ఇవాళ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గడం లేదని కేంద్రం ప్రకటన చేయడం చర్చనీయాంశం అవుతోంది. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం చేసిన తాజా ప్రకటన కేసీఆర్ కు షాకిచ్చేలా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Also Read..

బీఆర్ఎస్ లోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ...!

Advertisement

Next Story