- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మోడీకి లేఖ రాసిన మరుసటి రోజే సీబీఐ ఎంట్రీ.. ఆ స్కామ్‌లో మాజీ సీఎంకు బిగుస్తోన్న ఉచ్చు!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి విపక్ష నేతలు లేఖ రాసిన మరుసటి రోజు ఈ లేఖలో సంతకం చేసిన బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తల్లిని సీబీఐ ప్రశ్నించడం సంచలనం రేపుతోంది. 'ల్యాండ్ ఫర్ జాబ్స్' కుంభకోణానికి సంబంధించి ప్రశ్నించేందుకు సోమవారం పాట్నాలోని బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు.
యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో నాటి భూమి కుంభకోణంపై ప్రశ్నిస్తున్నారు. లాలు మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే లోని వివిధ జోన్లలో ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను అభ్యర్థుల నుంచి నామమాత్రపు ధరలకే వారి భూములు తీసుకున్నట్లు లాలు ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన సతీమణి బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, లాలు కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌లపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ దూకుడు పెంచింది. ఈ కుంభకోణంలో లాలు కుటుంబ సభ్యులతో పాటు మరో 13 మందిపై సీబీఐ గత ఏడాది అక్టోబర్ 7న చార్జిషీట్ దాఖలు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నేడు రబ్రీదేవి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. అయితే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టులాంటిదంటూ విపక్ష పార్టీలకు చెందిన తొమ్మిది మంది నేతలు మోడీకి లేఖ రాసిన మరుసటి రోజే సీబీఐ రబ్రీదేవి నివాసానికి చేరుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అయితే దీనిపై సీబీఐ క్లారిటీ ఇచ్చింది. ఇది రెయిడ్ కాదని సీబీఐ వర్గాలు తెలిపారు. రబ్రీ దేవి నుంచి ముందస్తుగా అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు పేర్కొన్నాయి.