- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TPCC chief Mahesh Kumar Goud : గ్రామాలలో కులగణన.. వర్గీకరణ సంబరాలు : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) శాసనసభ(Legislative Assembly)లో తీసుకున్న రెండు చరిత్రాత్మక నిర్ణయాలు కులగణన(Caste Census)..ఎస్సీ వర్గీకరణ(SC Classification)కు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో సంబరాలు(Celebrations) నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్(TPCC chief Mahesh Kumar Goud) పిలుపు నిచ్చారు. ఎన్నో ఏళ్ళు గా పెండింగ్ లో ఉన్న బీసీ కులగణన. ఎస్సీల వర్గీకరణ విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.
సమాజంలో రెండు ప్రధాన వర్గాలైన బీసీలు, ఎస్సీలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కులగణన, వర్గీకరణ కార్యక్రమాల అమలుకు కార్యాచరణకు సిద్ధమైందన్నారు. ఇందుకు కృషిచేసిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, ఉప సంఘం చైర్మన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజానరసింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , సీతక్కలకు, ఎంపీ మల్లు రవిలకు ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీసీ, ఎస్సీ వర్గాలు సంబరాల కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలని పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు.
మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాలులో బీసీ కులగణన(Caste Census)పై సబ్ కమిటీ చైర్మన్ , నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)పవర్ పాయింట్ ప్రజెంటేషన్(Power Point Presentation)ఇవ్వనున్నారు. ఇంకాసేపట్లో ప్రారంభం కాబోతున్న కుల గణన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర్ రాజా నరసింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క సహా ఇతర మంత్రులు హాజరుకానున్నారు.