గోదావరి బ్యారక్‌లో బండి.. కేటాయించిన ఖైదీ నంబర్ ఇదే..

by Sathputhe Rajesh |   ( Updated:6 April 2023 2:55 AM  )
గోదావరి బ్యారక్‌లో బండి.. కేటాయించిన ఖైదీ నంబర్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: టెన్త్ హిందీ పేపర్ లీక్ కుట్ర కేసులో హన్మకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్ మేజిస్ట్రేట్ బండి సంజయ్‌కి 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే కరీంనగర్ జైలులోని గోదావరి బ్యారక్ లో ఖైదీగా బండి సంజయ్ ఉన్నారు. ఖైదీ నంబర్ 7917ను బండికి జైలు అధికారులు కేటాయించారు. సంజయ్ జైలుకు వచ్చిన తర్వాత ఆయన్ను కలవడానికి కుటుంబీకులు రాగా పర్మిషన్ లేదని జైలర్ సంజయ్‌ని కలవడానికి నిరాకరించారు. దీంతో ఇవాళ ములాఖత్‌కు కుటుంబీకులు అప్లై చేసుకున్నారు. పర్మిషన్ వచ్చాక సంజయ్‌తో ఫ్యామిలీ మాట్లాడనుంది. అయితే బండి అరెస్ట్ నేపథ్యంలో కరీంనగర్ జైలు వద్దకు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో హై టెన్షన్ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more:

బండి అరెస్టుపై హైడ్రామా.. ప్రతి క్షణం పోలీసుల మాస్టర్ ప్లాన్

Next Story

Most Viewed