గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయడం కరెక్ట్ కాదు: అభ్యర్థులు

by GSrikanth |
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయడం కరెక్ట్ కాదు: అభ్యర్థులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించడంపై క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ నిర్ణయంతో తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నిరసన తెలిపారు.

జూన్‌లో నిర్వహిస్తామన్న మెయిన్ పరీక్షను యూపీఎస్సీ ద్వారా నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. పేపర్ లీక్ వ్యవహారంతో టీఎస్పీఎస్సీపై తమకు నమ్మకం లేదని ఇకపై టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను యూపీఎస్సీకి అప్పగించాలని కోరారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed