- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
NEET Row: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు డీఎంకేకు షాక్

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు నీట్ (NEET) పరీక్ష విషయంలో డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును నుంచి మినహాయించాలని గత కొన్నేళ్లుగా స్టాలిన్ సర్కారు డిమాండ్ చేస్తుంది. అయితే, తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ( Droupadi Murmu) తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ రాష్ట్ర శాసనసభలో వెల్లడించారు. ‘‘ఈ అంశంపై తమిళనాడు (Tamil Nadu) సర్కారు అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ.. నీట్ నుంచి మన రాష్ట్రాన్ని మినహాయించేందుకు కేంద్రం తిరస్కరిస్తోంది. ఇది దక్షిణాది రాష్ట్రాన్ని అవమానించడమే. అయితే, వారు (కేంద్రం) మన అభ్యర్థనను తిరస్కరించొచ్చు కానీ.. మన పోరాటాన్ని ఆపలేరు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు చట్టబద్ధమైన న్యాయ మార్గాలను వెతుకుతాం. న్యాయ నిపుణులను సంప్రదిస్తాం’’ అని స్టాలిన్ అసెంబ్లీలో తెలిపారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశం కోసం స్టాలిన్ పిలుపునిచ్చారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామన్నారు.
నీట్ వివాదం
మరోవైపు, నీట్ పరీక్ష (NEET Row) కారణంగా తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ పరిధి నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించాలంటూ అక్కడి ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చింది. ధనిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన ఇంటెన్సివ్ కోచింగ్, ప్రిపరేషన్‌ను తీసుకోగలరు. దీని వల్ల వారికి ప్రయోజనం ఉంటుంది. కానీ, 12వ తరగతి మార్కులను అడ్మిషన్ ప్రమాణాలుగా తీసుకోవడం వల్ల సామాజిక న్యాయం జరుగుతుందని తమిళనాడు రాష్ట్రం వాదిస్తోంది. ఈ బిల్లును ఇప్పటికే 2021, 2022లో రెండుసార్లు తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. ఆ తర్వాత గవర్నర్‌కు పంపగా.. పలుమార్లు తిరస్కరణకు గురైంది. దీంతో బిల్లులో కొన్ని మార్పులు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. మరోవైపు, నీట్ కు వ్యతిరేకంగా తమిళనాడు మాత్రమే కాదు.. పశ్చిమబెంగాల ప్రభుత్వం కూడా గళమెత్తింది. గతేడాది జులైలో నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చింది.