- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ajay Devgn: ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా స్టార్ హీరో.. ‘రైడ్ 2’ ట్రైలర్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn), డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా (Raj Kumar Gupta) కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ (Highly Anticipated) మూవీ ‘రైడ్-2’ (Raid-2). క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం 2018లో వచ్చి మంచి హిట్ అందుకున్న ‘రైడ్’కు సీక్వెల్‌గా రాబోతుంది. ఈ మూవీ నుంచి ఇటీవల వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అజయ్ దేవ్‌గణ్ పవర్ ఫుల్ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ (Income Tax Officer)గా కనిపించి ఆడియన్స్‌ను మెప్పించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది.
‘రైడ్ 2’ ట్రైలర్ ఏప్రిల్ 8న ముంబై(Mumbai)లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. అంతే కాకుండా ఏప్రిల్ 10న రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సన్నీ డియోల్ (Sunny Deol) సినిమా ‘జాట్’ థియేటర్స్‌లో ఈ ట్రైలర్(Trailer)ను ప్రదర్శించనున్నట్లు తెలుస్తుండా.. తర్వలో అఫీషియల్ నోట్ కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు. కాగా.. రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య మే 1న రిలీజ్ కానుంది.
The trailer of #AjayDevgn’s Raid 2 drops on April 8, 2025 with a grand launch in Mumbai! It’ll be attached to #SunnyDeol’s Jaat in cinemas from April 10, 2025!
— Siddharth R Kannan (@sidkannan) April 4, 2025
Directed by #RajKumarGupta. Produced by #BhushanKumar, #KrishanKumar, #KumarMangatPathak & #AbhishekPathak.#Raid2… pic.twitter.com/XZv2R1o86g