- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌లో చేరాలనుకున్నా: RS ప్రవీణ్ కుమార్
దిశ, వెబ్‌డెస్క్: బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీపై ఆయన స్పష్టమైన వైఖరిని తెలియజేశారు. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ‘ఒకే దేశం.. ఒకే మతం’ అంటూ బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నానని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో బీజేపీకి మాత్రం మద్దతు ఇవ్వబోను అని కూడా స్పష్టం చేశారు. కాగా, ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఎస్పీలో చేరాక మొదటిసారి మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన ఆర్ఎస్పీ.. నాలుగువేల పైచిలుకు ఓట్లు సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్ఎస్పీ తాజా వ్యాఖ్యలతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మద్దతు ఎవరికి ఉండబోతోంది అనేది హాట్ టాపిక్‌గా మారింది.