KCR : ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగు పెట్టనున్న కేసీఆర్

by M.Rajitha |   ( Updated:2025-03-11 13:28:49.0  )
KCR : ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగు పెట్టనున్న కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు గులాబీ బాస్ ఫాంహౌసును వీడి, అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు. బుధవారం నుంచి మొదలవనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల(Telangana Budget Sessions)కు కేసీఆర్ హాజరు కానున్నట్టు సమాచారం. మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Cheif KCR) అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ(BRSLP) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) శాసనసభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలని, తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై, బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు, ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరతపై అసెంబ్లీలో మండలిలోను పోరాడాలన్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా బీఆర్ఎస్ గొంతు వినిపించాలని, రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరుపై మాట్లాడాలన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఎల పెండింగు... పీఆర్సీ అమలుపై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలని, విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు విడుదలచేయక పోవడం గురించి, దళిత బంధును నిలిపివేయడం పట్ల సమావేశాల వేదికగా ప్రశ్నించాలన్నారు.,కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బీఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అధినేత కేసీఆర్ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. సభల్లో ఇంకా ప్రతిభావంతంగా ప్రజాసమస్యల మీద పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సహా....శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రావడం పట్ల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఆయన సభలో ఏం మాట్లాడతారు, ప్రభుత్వాన్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారని అంతా ఎదురు చూస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed