BRS: ఎందుకు ఈ సన్మానం..? కిషన్ రెడ్డి, రేవంత్ భేటీపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

by Ramesh Goud |
BRS: ఎందుకు ఈ సన్మానం..? కిషన్ రెడ్డి, రేవంత్ భేటీపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy)కి ఎందుకు ఈ సన్మానం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరసగా కేంద్రమంత్రులతో(Union Ministers) భేటీ(Meeting) అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిని సత్కరించారు. ఈ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కేటీఆర్.. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ఎందుకు ఈ సన్మానం..? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టనుపో అని చెప్పినందుకా? అని, అమృత్ స్కాంలో నీ బావమరిదిని కాపాడుతున్నందుకా? అని, పొంగులేటి ఇంట్లో జరిగిన ED సోదాల్లో వివరాలు బయటకి రాకుండా ఆపి, కేసులు పెట్టకుండా ఆపినందుకా? అని కేటీఆర్, రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు.

Advertisement

Next Story