- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS: మాయం తప్ప కాంగ్రెస్ చేసిందేమిటి..? తెలంగాణ తల్లి నమూనాపై కేటీఆర్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం(Telangana Secretariat)లో తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Talli Statue) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని ఈ నెల 9 న ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన తొలి నమూనాను ఈ రోజు విడుదల చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన విగ్రహ నమూనాపై బీఆర్ఎస్ వాదులు(BRS Supporters) విమర్శలు(Criticized) చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రభుత్వం పై హాట్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం(Crown) మాయం.. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ(Bathukamma) మాయం.. తెలంగాణ తల్లి కాళ్ల కడియాలు(Bracelets) మాయం అని కామెంట్లు చేశారు. అలాగే తెలంగాణ రవాణా లోగోలో చార్మినార్(Charminar), కాకతీయ కళాతోరణం(Kakatiya Kalathoranam) మాయం.. తెలంగాణ రైతుల భూములు మాయం.. మూసీ(Moosi) నది ఒడ్డున పేదల ఇండ్లు మాయం.. అని వ్యాఖ్యానించారు. అంతేగాక టీఎస్ లో ‘ఎస్’ మాయం.. ఖజానాలో కాసులు మాయం.. మాయం చేయడం, మోసం చేయడం మినహా ప్రజలకు చేసిందేమిటి ?, ప్రజలకు ఒరిగిందేమిటి ? అని సంచలన ఆరోపణలు చేశారు.