- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS VS BJP : దుబ్బాకలో హై టెన్షన్!
దిశ, వెబ్ డెస్క్: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ బస్టాండ్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. సోలిపేట రామ లింగారెడ్డి మరణం తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యం కాగా ఉప ఎన్నికల్లో ప్రధానంగా దుబ్బాక బస్టాండ్ పైనే చర్చ సాగింది. అసెంబ్లీలో బస్టాండ్ విషయాన్ని తాను ప్రస్తావించడంతోనే బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని రఘునందన్ రావు అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బస్టాండ్ నిర్మాణానికి బీఆర్ఎస్ బీజేపీలు హామీ ఇచ్చాయి. రూ.4కోట్ల వ్యయంతో ఏడాదిన్నర కాలంలో దుబ్బాక బస్టాండ్ నిర్మాణ పనులను పూర్తి చేశారు.
నేడు బస్టాండ్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించనున్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ప్రస్తుత మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బస్టాండ్ నిర్మాణం పూర్తి చేసిందని ప్రచారం చేస్తుండగా ఎమ్మెల్యే రఘునందన్ రావు తాను కొట్లాడటం వల్లే బస్టాండ్ నిర్మాణం త్వరగా పూర్తయిందంటున్నారు. ఇదే విషయమై ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం, సవాళ్లు ప్రతిసవాళ్ల నేపథ్యంలో దుబ్బాకలో ఏం జరగబోతోందోనన్న ఆందోళన నెలకొంది. బస్టాండ్ ప్రారంభోత్సవానికి వచ్చే వారికి పోలీసులు డ్రెస్ కోడ్ పెట్టారు. బస్టాండ్ లోకి బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు వస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరిని బస్టాండ్ ఆవరణలోకి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బస్టాండ్ ప్రాంగణంలోకి ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. కాగా బస్టాండ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇరు పార్టీల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద మొత్తంలో దుబ్బాకలో మోహరించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సిద్ధిపేట సీపీ శ్వేతా సమీక్షిస్తున్నారు.