BRS: ఇది ప్రజా పాలన కాదు, ప్రజాపీడనం.. జనగామ ఘటనపై హరీష్ రావు ఫైర్

by Ramesh Goud |   ( Updated:2025-01-27 14:32:04.0  )
BRS: ఇది ప్రజా పాలన కాదు, ప్రజాపీడనం.. జనగామ ఘటనపై హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసుల నిరంకుశ దాడి హేయమైన చర్య అని, ఇంకెంత కాలం పోలీస్ పహారాలో ప్రభుత్వాన్ని నడుపుతారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) అన్నారు. జనగామ జిల్లాలో జరిగిన ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలకు సంబంధించిన దృష్యాలను షేర్ చేశారు. దీనిపై ఆయన.. జనగామ జిల్లా(Jangaon District), ఎర్రగుంట తండాలో(Errakunta Thanda) జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండించారు. అలాగే లాటీలు విరిగేలా, రక్తాలు వచ్చేలా పోలీసులు విరుచుకుపడటం దారుణమని, మాజీ సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులపై పోలీసులు నిరంకుశంగా దాడి చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy)ని అరెస్టు(Arrest) చేయడం అప్రజాస్వామికమని, ఇది ప్రజా పాలన కాదు, ప్రజాపీడనం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై అణచివేత రాజకీయాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. హామీలు అడిగితే లాఠీచార్జ్, ప్రశ్నిస్తే అరెస్టులు! అని, ఎంతకాలం పోలీస్ పహారాలతో ప్రభుత్వం నడపాలని చూస్తున్నారు? అని నిలదీశారు. ఇక తక్షణమే అరెస్టు చేసిన ఎమ్మెల్యే, మాజీ సర్పంచ్, వార్డు సభ్యులను విడుదల చేసి, ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed