BRS: తడి బట్టలతో కురుమూర్తి గుడికి పోదామా..? సీఎంకు హరీష్ రావు సంచలన సవాల్

by Ramesh Goud |
BRS: తడి బట్టలతో కురుమూర్తి గుడికి పోదామా..? సీఎంకు హరీష్ రావు సంచలన సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: తడి బట్టలతో కురుమూర్తి గుడికి పోదామా రేవంత్ రెడ్డి? అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRA Leader Harish Rao Thanneeru) సవాల్(Challenge) విసిరారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా(Mahabub Nagar District) ప్రాజెక్టులను(Projects) బీఆర్ఎస్(BRS) పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి(Revanth Reddy) అబద్దాలు చెబుతున్నారని అన్నారు. పాలమూరు జిల్లాలో కురుమూర్తి దేవుడు(Kurumurthy God) అంటే అందరికీ నమ్మకం అని, ఆ కురుమూర్తి దేవుడి దగ్గరకి తడి బట్టలతో పోదామా? అని నిలదీశారు.

రాష్ట్రం రాకముందు పాలించిన టీడీపీ(TDP), కాంగ్రెస్(Congress) లు మహబూబ్ నగర్ జిల్లాను మోసం చేశాయని, 20 ఏళ్లు పాలించి 26 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చాయని తెలిపారు. కేసీఆర్(KCR) అధికారంలోకి వచ్చాక నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న తాను ప్రాజెక్టులు దగ్గర ఉండి కట్టించానని, బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఇది నిజం కాదని చెబుతారా అని, ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో కురుమూర్తి స్వామి ప్రమాణం చేద్దాం.. నేను రెడీ, నువ్వు వస్తావా అని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత ఛాలెంజ్ విసిరారు.

Next Story

Most Viewed