BRS: కౌలు రైతుకేది భరోసా? ఆ లేఖపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు

by Ramesh N |   ( Updated:2025-01-13 07:29:40.0  )
BRS: కౌలు రైతుకేది భరోసా? ఆ లేఖపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం (rythu bharosa) రైతు భరోసా పథకంపై ఆదివారం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే (Congress) కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ పార్టీ (BRS party) ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేస్తోంది. కౌలు రైతుకేది భరోసా? నాడు లేఖ.. నేడు ధోకా అంటూ మండిపడింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు రైతు భరోసా అందిస్తాం. కౌలు రైతులెవరూ ఆందోళన చెందొద్దు.. - ఇదీ 2023 సెప్టెంబర్‌ 13న పీసీసీ అధ్యక్షుడి హోదాలో కౌలురైతులకు రేవంత్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖ.. అంటూ గుర్తు చేసింది. తీరా అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు ధోకా ఇచ్చారని ఆరోపించింది. ఎన్నికలకు ముందు కౌలురైతులకు లేఖలు రాసిన రేవంత్.. నేడు ఎగనామం పెట్టారని విమర్శించింది.

రైతు భరోసా పథకం కింద రైతులకు ఈనెల 26 వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మార్గదర్శకాలను జారీ చేసింది. భూభారతి (ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నట్టు ఉత్తర్వుల్లో (జీవో ఆర్టీ నంబర్ 18 / తేదీ 10-01-2025) పేర్కొంది.

Next Story

Most Viewed