BREAKING: బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం.. క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ ఎంపీలు

by Satheesh |
BREAKING: బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం.. క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ ఎంపీలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్‌గా అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి వరుస పెట్టి గులాబీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుండగా.. మరోవైపు బీఆర్ఎస్ రాజ్య సభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నారంటూ తెలంగాణ పాలిటిక్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై గులాబీ పార్టీ రాజ్య సభ ఎంపీలు స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తున్నారంటూ వస్తోన్న వార్తలను వారు ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ ఎంపీ సురేష్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నలుగురు బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు ఊహాజనితమని కొట్టిపారేశారు. బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తున్నారంటూ జరుగుతోన్న ప్రచారం అవాస్తవమన్నారు. తప్పుడు వార్తలతో బీఆర్ఎస్‌పై బురద జల్లుతున్నారని మరో ఎంపీ గాయత్రి రవిచంద్ర అసహనం వ్యక్తం చేశారు.

కాగా, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కీలక నేతలు పక్క దార్లు చూస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకోగా.. త్వరలోనే మరి కొందరు సైతం వీరి బాటలోనే నడవనున్నట్లు తెలంగాణ పొలిటికల్ సర్కి్ల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసల ప్రవాహానికి అడ్డుకుట్టే వేసేందుకు నేరుగా గులాబీ కేసీఆర్ రంగంలోకి దిగిన ఫలితం లేకుండా పోతుంది. కేసీఆర్ బుజ్జగించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం గులాబీ బాస్ మాట లెక్కచేయకుండా అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు సైతం గులాబీకి గుడ్ బై చెప్పి కేంద్రంలో పవర్‌లో ఉన్న బీజేపీ గూటికీ చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. హై కమాండ్ వ్యూహాంలో భాగంగానే బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు కాషాయ పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనంనపై గులాబీ పార్టీ ఎంపీలు పై విధంగా రియాక్ట్ అయ్యారు. దీంతో బీజేపీలో బీఆర్ఎస్ మెర్జ్ వార్తలకు తెర పడింది.



Next Story