MLC Kavitha : గంగపుత్ర సంఘాలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-03 08:38:10.0  )
MLC Kavitha : గంగపుత్ర సంఘాలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు జీవితం అనంతరం మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేసేందుకు తపిస్తున్న బీఆరెఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)క్రియాశీలక రాజకీయాల్లో బిజీ అయ్యారు. నిత్యం ప్రజా సమస్యలపైన స్పందిస్తు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా బీసీల హక్కుల పోరాటాలపై ఫోకస్ పెట్టిన కవిత తాజాగా తెలంగాణ జాగృతి తరపున బీసీ డెడికేటెడ్ కమీషన్‌కు రిపోర్ట్ సమర్పించారు. వరుసగా బీసీ సంఘాలు, కుల సంఘాలు, వృత్తిదారుల సంఘాలతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో గంగపుత్ర సంఘాల(Gangaputra associations)నాయకులతో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. బీసీ డెడికేటెడ్ కమీషన్‌కు నివేదిక సమర్పించినందుకు వారు కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గంగాపుత్రులు ఎదుర్కోంటున్న పలు సమస్యలను కవిత దృష్టికి తీసుకెళ్లారు.

కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని, ఈ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తాలని కవితను కోరారు. సమావేశంలో కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవంతో ఉచిత చేప పిల్లల పథకాన్ని అమలు చేయడంతో పాటు వారికి వాహనాలు, రుణాలు, వలలు వంటివి అందించడం ద్వారా గంగాపుత్రుల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పథకాలను నిర్వీర్యం చేసి గంగాపుత్రుల జీవనోపాధిని దెబ్బతీసిందన్నారు. గంగాపుత్రులు, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చట్టసభల బయట, లోపల తమ గళం వినిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ , బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జై సింహా తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story