- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS MLA: సీఎం రేవంత్ నా ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎటు తీసుకువెళ్తున్నారో అర్ధం కావడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) విమర్శలు చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి నన్ను ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు. డ్రగ్స్ కేసులో నన్ను కూడా ఇరికించే ప్రయత్నం చేశారు. ప్రయివేటు ఫంక్షన్‌కు వెళ్తే అక్కడికి డీఎస్పీలు, సీఐలు వచ్చారు. అక్కడ డ్రగ్స్ పెట్టి కేసు నమోదు చేయాలని ట్రై చేశారని కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) కీలక ఆరోపణలు చేశారు. ఇటీవల రాజ్ పాకాల ఇంట్లో కూడా అదే జరిగిందని.. అక్కడికి కేటీఆర్(KTR) వస్తే డ్రగ్స్ పెట్టి ఇరికించాలని చూశారని అన్నారు. నా విషయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి(Shivdhar Reddy)ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తిట్టారని తెలిపారు.
‘నా కారులో డ్రగ్స్ ప్యాకెట్లు పెట్టాలని స్వయంగా పోలీసులనే ఫోర్స్ చేశారు’ అని కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. నా ఇంటి చుట్టు రోజూ ఇంటెలిజెన్స్ వాళ్లు తిరుగుతున్నారు. నాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నా్యి’ అని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అసలు డ్రగ్స్ తీసుకునేది బీఆర్ఎస్ నేతలో, కాంగ్రెస్ నేతలో తేలాలి అని అన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్‌ను రేవ్ పార్టీ అనడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్లా వ్యవహరిస్తున్నారు. మరోసారి అలా ప్రవర్తిస్తే ఊరుకోము అని వార్నింగ్ ఇచ్చారు.