కేసీఆర్‌తో ఎమ్మెల్యేల భేటీ.. రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పడొద్దని సూచన

by Gantepaka Srikanth |
కేసీఆర్‌తో ఎమ్మెల్యేల భేటీ.. రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పడొద్దని సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కేటీఆర్ అధ్వర్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. భవిష్యత్‌లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలను సైతం సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సీఎం వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీయాలని, రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పడొద్దని, పార్టీ ఆధ్వర్యంలో పనిచేసుకుంటూ ముందుకుసాగాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, కోరుకంటి చందర్ తదిరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed